BJP New Plan Polavaram Game To Get  Votes In Andhra Pradesh

ఎపి లో ఓట్ల కోసమే పోలవరం ఆట బీజేపీ కొత్త ప్లాన్ ఇదేనా?


రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదని భావన ఆంధ్ర ప్రజలలో బలంగా పడింది. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ ల చేసేందుకు ఎపి ప్రజలు అనుకుంటున్నట్లు అర్ధం అవుతుంది. దింతో ఎపి ప్రజలను బీజేపీ వైపు తిప్పుకోవడం కోసం రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం అయినా పోలవరం పైన కన్నేసింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు గ చేసి దాన్ని కేంద్రం చేస్తులోకి తీసుకోని ఎన్నికల సమయం లో కేంద్రం పూర్తి చేసినట్లు గ ఘనతను సాధించినట్లు చెప్పుకోవాలని కేంద్రం చూస్తుందని సమాచారం.

ఈ వ్యూహంలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పర్యవేక్షణలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాజయాకియ నిపుణులు సైతం ఇదే వెల్లడిస్తున్నారు. మొదట కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దింతో 2015 ఆఖరి నుంచి చంద్రబాబు శరవేగంగా ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని కసరత్తులు చేసారు ప్రధాన కాంట్రాక్టు ఆర్ధిక పరిస్థుతుల వాళ్ళ ప్రాజెక్ట్ నిదానంగా జరుగుతుందని కొత్త టెండర్లకు అవకాశం ఇచ్చారు . అయినా కొన్ని రోజులకి కాఫర్ డ్యామ్ విష్యం లో కేంద్రం నుంచి దాన్ని నిలిపివేయమని నోటీసులు వచ్చాయని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ)ని అధ్యయనం చేయాలని కోరడాన్ని జల వనరులశాఖ వర్గాలు తప్పుబడుతున్నాయి.

కానీ నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నుంచి ఇంకా నివేదికలు రవకపోవడం అందర్నీ అనుమానానికి గురి చేస్తుంది పైగా జల వనరుల శాఖ నుంచి పలు బృందాలు వరుస పెట్టి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రావడం మరియు పరిశీలించడం కూడా అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు సీఈవో హాల్దర్‌ పర్ మరియు కేంద్ర మంత్రి గడ్కరీ ఓఎస్డీ ఖోలాపుర్కర్‌ పర్యటించారు. త్వరలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ కూడా రానున్నారు. ఇలా వరస పెట్టి కేంద్ర ప్రభుత్వ నిపుణులు రావడం ఈ గేమ్ లోని భాగంగానే పోలవరాన్ని కేంద్రం పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తుందని రాజకీయ ప్రముఖుల అభిప్రాయం.

YCP MPs shames Ys Jagan Mohan Reddy

హస్తినలో జగన్ పరువు తీస్తున్న ఎంపీలు


ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పార్టీ ని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే ఆ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రం ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు ప్రకటనలు చేస్తూ జగన్ కి కొత్త తలనొప్పి తీసుకొస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై శాసన సభలో ప్రకటన చేసిన తరువాత లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన నితిన్ గడ్కరీ

ఇదే విషయం మీద ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఏపీ బీజీపీ నాయకులు చర్చలు కూడా జరిపారు. కానీ ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వెంటనే తేరుకుని హడావుడిగా నితిన్ గడ్కరీని కలిసి ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ని తక్షణమే కేంద్రం స్వాధీనం చేసుకుని కేంద్ర అజమాయిషీలో పనులు జరిగేలా చూడాలని కోరారు. ఇక్కడే వైసీపీ నీచ బుద్ది బయటపడింది. రాష్ట్రం, ఏపీ ప్రజలు నష్టపోయినా పర్వాలేదు మాకు మాత్రం పంతమే కావాలని వైసీపీ ఎంపీలు ప్రవర్తించారు. అక్కడితో ఆగితే పర్లేదు, ప్రత్యేక హోదా వస్తుంది అనుకొంటే, మేము రాజీనామాలు చేసేస్తాం. ఇక్కడ మేము కూడా లేక పోతే కేంద్రాన్ని ప్రశ్నించే వారు లేరని ఆగిపోతున్నాము అంటూ తమ తమ రాజకీయ అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.

నమ్మే వారు ఏదైనా చెప్పేయొచ్చు అని అనుకున్నారేమో అందుకే కేంద్రంలో అడిగేవారు లేరని అందుకే ప్రత్యేక హోదా మీద రాజీనామాలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పుకొస్తున్న వీరు మరి రాష్ట్ర శాసన సభలో ఈ విషయాన్ని ప్రశ్నించాలని తెలియకుండానే శాసన సభకు డుమ్మా కొట్టారా..?

మేము ఏమీ మాట్లాడకపోయినా ఏపీ సీఎం మాత్రం చాలా చక్కగా ప్రశ్నిస్తారనే దైర్యం వేళ్లల్లో కలిగిందేమో. వైసీపీ ఎంపీలు ఆలా చేస్తే రాష్ట్రం లో ఎమ్యెల్యేలు జగన్ సూచనలతో శాసన సభలో అడుగు పెట్టకుండా ఆగిపోయారు. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి..? గతంలోనూ … ఏపీకి ఉపాధి హామీ నిధులు విడుదల అవ్వకుండా చూడాలంటూ వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి ఇచ్చిన లేఖలు బయటపడడంతో ప్రజల్లో వైసీపీ పరువు పోయింది. ఆ పోయిన పరువుని మళ్ళీ కాపాడుకోవడానికి అన్నట్టు ఏపీకి ఉపాధి హామీ నిధులు ఎక్కువ కేటాయించామని కోరడం వైసీపీ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం.

Latest Schemes For New Year In Andhra Pradesh

కొత్త సంవత్సరం లో ఏపీలో కొత్త పథకం


ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం కొత్త ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్రానికి నిధుల కొరత ఇబ్బందికరంగా తయారైన కానీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు. మరి పది రోజుల్లో రానున్న కొత్త ఏడాదిలో బడుగు బలహీన వర్గాల కోసం మరో పధకం ప్రవేశ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయాలను పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

నూతన సంవత్సర కానుకగా వెనుకబడిన వారికి చంద్రబాబు ప్రభుత్వం పెళ్లికానుక అందించాలని నిర్ణయించిందని మంత్రి వివరించారు. కొత్తగా పెళ్లి చేసుకోబోయే వధూవరులు రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తే పెళ్లిరోజు నాటికి రూ.30 వేలు ఇవ్వనున్నట్లు వివరించారు. వెనుకబడిన వర్గాల్లోని పేదలకు ఈ పధకం మరో వరం కానుంది. ఇప్పటికే క్రిస్మస్, సంక్రాంతి కానుక పేరిట అందరి ఇళ్లలో పండగ వెలుగు నిండేలా సీఎం కృషి చేస్తున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వివరించారు.

ఇక రాష్ట్రంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి రూ.10 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు మంత్రి లోకేష్‌ ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. మరో మంత్రి సిద్దా రాఘవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పక్క రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచాయన్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థవంతమైన నాయకత్వంతోనే సాధ్యమయిందని చెప్పారు.

భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉన్నదని ప్రజలు గుర్తించారన్నారు. ఇక వైఎస్‌ జగన్‌ పాదయాత్ర విషయానికి వస్తే పాదయాత్రకు ప్రజల మద్దతు లేదని, ఎన్ని హామీలు ఇచ్చినా జగన్‌ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, ఆయన రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండి పడ్డారు.

Big Shock With Rajinikanth for Kodala Nani in Gudivada

గుడివాడ‌లో దేవినేని దెబ్బకు నాని చుక్కలు చుడనున్నాడా?


గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది కొడాలి నాని. అలియాస్ కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు. టీడీపీ నుంచి రాజ‌కీయం మొద‌లుపెట్టి ప్ర‌స్తుతం వైసీపీలో ఓ వెలుగు వెలుగుతున్న నేత‌. గుడివాడ‌ను త‌న కంచుకోటగా మార్చుకున్నాడు కొడాలి నాని. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న అక్క‌డి నుంచే విజ‌యం సాధిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌లో కృష్ణా జిల్లాలో టీడీపీ గాలి వీచినా త‌ట్టుకోని నిల‌బడ్డాడు నాని. దీనికి ముఖ్య కార‌ణం. అక్క‌డ ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉండ‌డ‌మే.

వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాక నాని. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై చాలా విమ‌ర్శ‌లు చేసాడు కొన్నిసార్లు ఆయ‌న‌ను వాడు.. వీడు అని అనడం కూడా జ‌రిగింది. ఆ త‌ర‌వాత అసెంబ్లీ స‌మావేశాల‌లో నాని ఓవ‌ర్ యాక్ష‌న్ అంద‌రూ చూసారు. అందుకే, 2019 ఎన్నిక‌లలో నానిని టార్గెట్ చేస్తోంది టీడీపీ. గుడివాడ‌లోనే ఆయ‌న‌ను ఓడించి అసెంబ్లీకి రాకుండా చూసేందుకే ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తులు షురూ చేసింది టీడీపీ హైక‌మాండ్‌. ఆ బాధ్య‌త‌ను నీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమాకి అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

రీసెంట్‌గా నానికి షాక్ ఇస్తూ ఆయ‌న అనుచ‌రులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ గూటికి చేరుకున్నారు. వీరిలో గుడివాడ మేయ‌ర్ ర‌వికాంత్ ఒకరు. నాని కీల‌క అనుచ‌రుల‌లో ర‌వికాంత్ ఒక‌రు. ఆయ‌న‌కు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. నాని ప‌నుల‌ను అన్నింటినీ ఆయ‌నే చూసుకుంటారని కామెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి రవికాంత్ తాజాగా టీడీపీ లోనికి రావడం నానిని క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తోంద‌ట‌.

టీడీపీ కండువా క‌ప్పుకున్న ర‌వికాంత్‌ నానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నానికి ద‌ళితుల‌పై న‌మ్మకం లేద‌ని, వారిని వాడుకొని వ‌దిలేయాల‌ని త‌న‌తోనే చాలా సార్లు అన్న‌ట్లు మీడియా సాక్షిగా తెలిపారు. ర‌వికాంతే కాదు.. త్వ‌ర‌లోన మ‌రికొంత మంది నాని అనుచ‌రులు కూడా టీడీపీ లో రావడానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. దేవినేని ఇప్ప‌టికే గుడివాడ కేంద్రంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ షురూ చేశార‌ని, మ‌రికొంద‌రు రవికాంత్ బాట‌లోనే ఉన్నార‌ని నాని టీమ్ ఓపెన్‌గా చెబుతుండ‌డం విశేషం. ఇదే జ‌రిగితే, నానికి షాక్ తగిలినట్లే. 2019కి ముందే ఆయ‌న చేతులెత్తేయ‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. మ‌రి, ఉమా గేమ్ ప్లాన్‌ని నాని ఎలా కౌంట‌ర్ చేస్తాడో చూడాలి.

Chandrababu Tweet About Jagan Birthday

చంద్రబాబు ట్వీట్ కి జగన్ ఎం రిప్లై ఇచ్చాడు?


చంద్రబాబు, జగన్ ఎంత భద్ర శత్రువులో అందరికి తెలిసిందే. అసంబ్లీ లోనే కాదు బయట కూడా ఒకరు అంటే ఒకరికి పడదు. అలాంటి శ‌త్రువుల మ‌ధ్య తాజాగా ఫ్రెండ్లీ ట్వీట్‌లు న‌డుస్తున్నాయి. అవి ఎంతో కాలం కాదు ఈ ఒక్క రోజుకి మాత్ర‌మే. అవేంటో తెలుసు కోవాలనుకుంటున్నారా?

ఈరోజు జ‌గ‌న్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు జగన్ కు ట్విట్టర్ లో పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత అయిన వైఎస్ జ‌గ‌న్. ప్ర‌స్తుతం జగన్ అనంతపురంలో పాదయాత్ర చేస్తున్నారు. చంద్ర‌బాబు ఫారిన్ టూర్‌లో ఉన్నారు. అయినా కానీ, జ‌గ‌న్ బ‌ర్త్ డేని గుర్తుపెట్టుకొని ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. బాబు విదేశాల‌లో ఉండ‌డంతో జ‌గ‌న్‌కు ట్విట్ట‌ర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.చంద్ర‌బాబు సందేశానికి జ‌గ‌న్ కూడా రిప్లై ట్వీట్ చేశారు. త‌న‌కు విషెస్ తెలియ‌జేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్లెజెంట్ స‌ర్‌ప్రైజ్ అండి.. థాంక్‌యూ అంటూ రీ ట్వీట్ చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం నెల‌కొన్నందుకు ఇరు పార్టీల నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.జగ‌న్‌కి చంద్ర‌బాబు ఇలా బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తేడాది ఆయ‌న అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్ సీటు వ‌ద్దకు వెళ్లి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈసారి ఇలా సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. రాజ‌కీయ ప‌రంగా జ‌గ‌న్‌… చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. ఆయ‌న‌ను కాల్చిపారేయాలి…. చంపి పాత‌రేయాలి.. అంటూ అన‌రాని మాట‌లతో విమ‌ర్శిస్తుంటారు. అయినా, చంద్ర‌బాబు మాత్రం కూల్‌గా రిప్లై ఇస్తారు.

జ‌గ‌న్ పుట్టిన‌రోజుకి ఇలా విషెస్ అంద‌జేసి స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఏపీ ముఖ్యమంత్రి త‌న హుందాత‌నాన్ని చాటుకుంటున్నారు. రాజ‌కీయాల‌లో శ‌తృత్వం అంశాలవారీగా ఉండాలి కానీ, వ్య‌క్తిగతంగా కాద‌ని బాబు ఫిలాస‌ఫీ.. దానిని అక్ష‌రాలా చాటుతున్నారు చంద్ర‌బాబు.. ఈ ప‌రిణ‌తే బాబును విల‌క్ష‌ణ రాజ‌కీయ నేత‌గా నిల‌బెట్టింది.

Kadapa YCP Mla left the ysrcp and join in tdp

జగన్ సొంత జిల్లా కడపలో మరో వైసీపీ వికెట్ డౌన్


వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీ లోకి రానున్నాడా? అది కూడా జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి? ఇలాంటి ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైసీపీ కడప ప్రొద్దుటూరు నుంచి రాచ‌మల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి టీడీపీ లోకి రాబోతున్నాడని సమాచారం. ఇదే కనుక జరిగితే వైసీపీ నుంచి టీడీపీ కి వచ్చిన ఎమ్మెల్యే ల సంఖ్య 24కి చేరనుంది. శివ‌ప్ర‌సాద్ రెడ్డి కి జగన్ మోహన్ రెడ్డి తో మంచి అనుబంధం ఉంది మరియు ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. తక్కువ వ్యవధిలోనే మంచి లీడర్ గ పేరు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉండగా శివ‌ప్ర‌సాద్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే ప్ర‌చారం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. గత కొంతకాలంగా శివ‌ప్ర‌సాద్ రెడ్డి ని పార్టీ కార్యక్రమాలకి దూరంగ ఉంచుతున్నారని సమాచారం. ఇదేమిటని శివ‌ప్ర‌సాద్ రెడ్డి పార్టీ ని ప్రశ్నిస్తే పార్టీ వర్గాల నుంచి మౌనం సమాధానంగా వస్తుందని సమాచారం అందువల్ల శివ‌ప్ర‌సాద్ రెడ్డి గారు టీడీపీ కి రానున్నారని సమాచారం.

మ‌రోవైపు త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీ నుంచి మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అందులో, రెండు స్థానాలు టీడీపీకి ఖరార‌వ‌గా, వైసీపీకి ఒక్క‌టి ద‌క్కే చాన్స్ ఉంది. కానీ, ఆ పార్టీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంప్ చేస్తే అది కూడా ద‌క్క‌దు. ఇదే టీడీపీ టార్గెట్ కూడా. మ‌రి, ఈ సంక్షోభం నుంచి పార్టీని జ‌గ‌న్ ఎలా కాపాడుకుంటాడో చూడాలి.

Reason Behind Agnyaathavaasi Teaser Background Song

అజ్ఞాతవాసి టీసర్ సాంగ్ వెనుక రహస్యం తెలుసా?


పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న అజ్ఞ్యాతవాసి టీసర్ నిన్న విడుదలైన విష్యం అందరికి తెలిసిందే. టీసర్ చుసిన ప్రతి ఒక్కరు అందులోని వెనుక వచ్చే సంగీతం గురించి మాట్లాడుకుంటున్నారు. (మధురాపురి సదనా మృదు వదనా.. మధుసూదనా ఇహ.. స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత) అంటూ సాగుతున్న ఈ పదాలు 300 ఏళ్ల కిందటి పదాలు కావడం విశేషం. వేంకటేశ్వరస్వామి భక్తుడైన తమిళ కవి ఊతుక్కాడ వేంకట కవి ఈ కీర్తనను రాయడం విశేషం.

ఆ కీర్తనకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ చాలా చక్కగా సంగీతాన్ని అందించాడు. ఇది టీసర్ లోనే ఒక ప్రత్యేక పాత్ర వహించింది. 300 సంవత్సరాల ముందటి కీర్తనను వెతికి ఆ కీర్తనను సినిమాలో పొందుపరిచినందుకు త్రివిక్రమ్ మీద సాహిత్యాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ పాటను సినిమాలో ఎలా వాడుకున్నారో చూడాలి. అజ్ఞాతవాసి ఆడియో ఈ నెల 19న విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

Pawan Kalyan agnyaathavaasi is most liked teaser in tollywood

అజ్ఞ్యాతవాసి టీసర్ తో పవన్ సత్తా చాటాడు


పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం అజ్ఞ్యాతవాసి ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మానుయేల్ మరియు కీర్తి సురేష్ లు కథానాయకి గ నటిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని హారిక మరియు హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. అది పినిశెట్టి, బోమన్ ఇరానీ సహాయక పాత్రలలో నటిస్తున్నారు. తమిళ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.

అజ్ఞ్యాతవాసి టీసర్ ని ఈ నెల 16వ తేదీన 6.30 గంటలకి రిలీజ్ చేసారు. ఈ టీసర్ రిలీజ్ చేయకముందే ట్విట్టర్ లో అగ్న్యాతవాసి టీసర్ డే అని హాష్ టాగ్ భారతదేశంలో నాలుగోవ స్తానం లో నిలిచింది. టీసర్ రిలీజ్ చేసాక అగ్న్యాతవాసి టీసర్ అనే హాష్ టాగ్ మొదటి స్తానం లో నిలిచింది. ఇది ఆలా ఉండగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే తక్కువ టైం లో ఎక్కువ లైక్ లు వచ్చిన టీసర్ గ అజ్ఞ్యాతవాసి టీసర్ నిలిచింది. టీసర్ రిలీజ్ అయినా 21 గంటలలో 6 మిలియన్ వ్యూస్ తో మరియు 4 లక్షల లైక్స్ తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆనందకరమైన విషయంగా చెప్పవచ్చు.