అజ్ఞాతవాసి టీసర్ సాంగ్ వెనుక రహస్యం తెలుసా?


Dec 18 2017 6:37 AM

movies,agnyaathavaasi,agnaathavaasi,pawan kalyan,background song


అజ్ఞాతవాసి టీసర్ సాంగ్ వెనుక రహస్యం తెలుసా?: పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న అజ్ఞ్యాతవాసి టీసర్ నిన్న విడుదలైన విష్యం అందరికి తెలిసిందే. టీసర్ చుసిన ప్రతి ఒక్కరు అందులోని వెనుక వచ్చే సంగీతం గురించి మాట్లాడుకుంటున్నారు. (మధురాపురి సదనా మృదు వదనా.. మధుసూదనా ఇహ.. స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా మధుర మధుర రతి సాహస సాహస వ్రజ యువతి జన మానస పూజిత) అంటూ సాగుతున్న ఈ పదాలు 300 ఏళ్ల కిందటి పదాలు కావడం విశేషం. వేంకటేశ్వరస్వామి భక్తుడైన తమిళ కవి ఊతుక్కాడ వేంకట కవి ఈ కీర్తనను రాయడం విశేషం.

ఆ కీర్తనకు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ చాలా చక్కగా సంగీతాన్ని అందించాడు. ఇది టీసర్ లోనే ఒక ప్రత్యేక పాత్ర వహించింది. 300 సంవత్సరాల ముందటి కీర్తనను వెతికి ఆ కీర్తనను సినిమాలో పొందుపరిచినందుకు త్రివిక్రమ్ మీద సాహిత్యాభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ పాటను సినిమాలో ఎలా వాడుకున్నారో చూడాలి. అజ్ఞాతవాసి ఆడియో ఈ నెల 19న విడుదల కానుంది. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.