జగన్ సొంత జిల్లా కడపలో మరో వైసీపీ వికెట్ డౌన్


Dec 18 2017 8:48 AM

politics,ysrcp,tdp,kadapa


జగన్ సొంత జిల్లా కడపలో మరో వైసీపీ వికెట్ డౌన్: వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే టీడీపీ లోకి రానున్నాడా? అది కూడా జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి? ఇలాంటి ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైసీపీ కడప ప్రొద్దుటూరు నుంచి రాచ‌మల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డి టీడీపీ లోకి రాబోతున్నాడని సమాచారం. ఇదే కనుక జరిగితే వైసీపీ నుంచి టీడీపీ కి వచ్చిన ఎమ్మెల్యే ల సంఖ్య 24కి చేరనుంది. శివ‌ప్ర‌సాద్ రెడ్డి కి జగన్ మోహన్ రెడ్డి తో మంచి అనుబంధం ఉంది మరియు ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు. తక్కువ వ్యవధిలోనే మంచి లీడర్ గ పేరు తెచ్చుకున్నాడు.

ఇది ఇలా ఉండగా శివ‌ప్ర‌సాద్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్ప‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే ప్ర‌చారం పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. గత కొంతకాలంగా శివ‌ప్ర‌సాద్ రెడ్డి ని పార్టీ కార్యక్రమాలకి దూరంగ ఉంచుతున్నారని సమాచారం. ఇదేమిటని శివ‌ప్ర‌సాద్ రెడ్డి పార్టీ ని ప్రశ్నిస్తే పార్టీ వర్గాల నుంచి మౌనం సమాధానంగా వస్తుందని సమాచారం అందువల్ల శివ‌ప్ర‌సాద్ రెడ్డి గారు టీడీపీ కి రానున్నారని సమాచారం.

మ‌రోవైపు త్వ‌ర‌లోనే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏపీ నుంచి మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అందులో, రెండు స్థానాలు టీడీపీకి ఖరార‌వ‌గా, వైసీపీకి ఒక్క‌టి ద‌క్కే చాన్స్ ఉంది. కానీ, ఆ పార్టీ నుంచి మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు జంప్ చేస్తే అది కూడా ద‌క్క‌దు. ఇదే టీడీపీ టార్గెట్ కూడా. మ‌రి, ఈ సంక్షోభం నుంచి పార్టీని జ‌గ‌న్ ఎలా కాపాడుకుంటాడో చూడాలి.