చంద్రబాబు ట్వీట్ కి జగన్ ఎం రిప్లై ఇచ్చాడు?


Dec 22 2017 7:34 AM

politics,jagan,chandrababu,tdp,ycp,ysrcp


చంద్రబాబు ట్వీట్ కి జగన్ ఎం రిప్లై ఇచ్చాడు?: చంద్రబాబు, జగన్ ఎంత భద్ర శత్రువులో అందరికి తెలిసిందే. అసంబ్లీ లోనే కాదు బయట కూడా ఒకరు అంటే ఒకరికి పడదు. అలాంటి శ‌త్రువుల మ‌ధ్య తాజాగా ఫ్రెండ్లీ ట్వీట్‌లు న‌డుస్తున్నాయి. అవి ఎంతో కాలం కాదు ఈ ఒక్క రోజుకి మాత్ర‌మే. అవేంటో తెలుసు కోవాలనుకుంటున్నారా?

ఈరోజు జ‌గ‌న్ బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా చంద్రబాబు జగన్ కు ట్విట్టర్ లో పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత అయిన వైఎస్ జ‌గ‌న్. ప్ర‌స్తుతం జగన్ అనంతపురంలో పాదయాత్ర చేస్తున్నారు. చంద్ర‌బాబు ఫారిన్ టూర్‌లో ఉన్నారు. అయినా కానీ, జ‌గ‌న్ బ‌ర్త్ డేని గుర్తుపెట్టుకొని ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. బాబు విదేశాల‌లో ఉండ‌డంతో జ‌గ‌న్‌కు ట్విట్ట‌ర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.



చంద్ర‌బాబు సందేశానికి జ‌గ‌న్ కూడా రిప్లై ట్వీట్ చేశారు. త‌న‌కు విషెస్ తెలియ‌జేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్లెజెంట్ స‌ర్‌ప్రైజ్ అండి.. థాంక్‌యూ అంటూ రీ ట్వీట్ చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం నెల‌కొన్నందుకు ఇరు పార్టీల నేత‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.



జగ‌న్‌కి చంద్ర‌బాబు ఇలా బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డం ఇదే తొలిసారి కాదు.. గ‌తేడాది ఆయ‌న అసెంబ్లీ సాక్షిగా జ‌గ‌న్ సీటు వ‌ద్దకు వెళ్లి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈసారి ఇలా సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. రాజ‌కీయ ప‌రంగా జ‌గ‌న్‌… చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతుంటారు. ఆయ‌న‌ను కాల్చిపారేయాలి…. చంపి పాత‌రేయాలి.. అంటూ అన‌రాని మాట‌లతో విమ‌ర్శిస్తుంటారు. అయినా, చంద్ర‌బాబు మాత్రం కూల్‌గా రిప్లై ఇస్తారు.

జ‌గ‌న్ పుట్టిన‌రోజుకి ఇలా విషెస్ అంద‌జేసి స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఏపీ ముఖ్యమంత్రి త‌న హుందాత‌నాన్ని చాటుకుంటున్నారు. రాజ‌కీయాల‌లో శ‌తృత్వం అంశాలవారీగా ఉండాలి కానీ, వ్య‌క్తిగతంగా కాద‌ని బాబు ఫిలాస‌ఫీ.. దానిని అక్ష‌రాలా చాటుతున్నారు చంద్ర‌బాబు.. ఈ ప‌రిణ‌తే బాబును విల‌క్ష‌ణ రాజ‌కీయ నేత‌గా నిల‌బెట్టింది.