గుడివాడ‌లో దేవినేని దెబ్బకు నాని చుక్కలు చుడనున్నాడా?


Dec 23 2017 5:56 AM

politics,kodali nani,devineni uma,rajinikanth,tdp,ysrcp,ycp


గుడివాడ‌లో దేవినేని దెబ్బకు నాని చుక్కలు చుడనున్నాడా?: గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం అంటేనే ముందుగా గుర్తుకు వ‌చ్చేది కొడాలి నాని. అలియాస్ కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు. టీడీపీ నుంచి రాజ‌కీయం మొద‌లుపెట్టి ప్ర‌స్తుతం వైసీపీలో ఓ వెలుగు వెలుగుతున్న నేత‌. గుడివాడ‌ను త‌న కంచుకోటగా మార్చుకున్నాడు కొడాలి నాని. గ‌త కొన్నేళ్లుగా ఆయ‌న అక్క‌డి నుంచే విజ‌యం సాధిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌లో కృష్ణా జిల్లాలో టీడీపీ గాలి వీచినా త‌ట్టుకోని నిల‌బడ్డాడు నాని. దీనికి ముఖ్య కార‌ణం. అక్క‌డ ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉండ‌డ‌మే.

వైసీపీ తీర్ధం పుచ్చుకున్నాక నాని. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై చాలా విమ‌ర్శ‌లు చేసాడు కొన్నిసార్లు ఆయ‌న‌ను వాడు.. వీడు అని అనడం కూడా జ‌రిగింది. ఆ త‌ర‌వాత అసెంబ్లీ స‌మావేశాల‌లో నాని ఓవ‌ర్ యాక్ష‌న్ అంద‌రూ చూసారు. అందుకే, 2019 ఎన్నిక‌లలో నానిని టార్గెట్ చేస్తోంది టీడీపీ. గుడివాడ‌లోనే ఆయ‌న‌ను ఓడించి అసెంబ్లీకి రాకుండా చూసేందుకే ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తులు షురూ చేసింది టీడీపీ హైక‌మాండ్‌. ఆ బాధ్య‌త‌ను నీటి పారుద‌ల శాఖ మంత్రి దేవినేని ఉమాకి అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం.

రీసెంట్‌గా నానికి షాక్ ఇస్తూ ఆయ‌న అనుచ‌రులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ గూటికి చేరుకున్నారు. వీరిలో గుడివాడ మేయ‌ర్ ర‌వికాంత్ ఒకరు. నాని కీల‌క అనుచ‌రుల‌లో ర‌వికాంత్ ఒక‌రు. ఆయ‌న‌కు స్థానికంగా మంచి గుర్తింపు ఉంది. నాని ప‌నుల‌ను అన్నింటినీ ఆయ‌నే చూసుకుంటారని కామెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి రవికాంత్ తాజాగా టీడీపీ లోనికి రావడం నానిని క‌ల‌వ‌రపాటుకు గురి చేస్తోంద‌ట‌.

టీడీపీ కండువా క‌ప్పుకున్న ర‌వికాంత్‌ నానిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నానికి ద‌ళితుల‌పై న‌మ్మకం లేద‌ని, వారిని వాడుకొని వ‌దిలేయాల‌ని త‌న‌తోనే చాలా సార్లు అన్న‌ట్లు మీడియా సాక్షిగా తెలిపారు. ర‌వికాంతే కాదు.. త్వ‌ర‌లోన మ‌రికొంత మంది నాని అనుచ‌రులు కూడా టీడీపీ లో రావడానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. దేవినేని ఇప్ప‌టికే గుడివాడ కేంద్రంగా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ షురూ చేశార‌ని, మ‌రికొంద‌రు రవికాంత్ బాట‌లోనే ఉన్నార‌ని నాని టీమ్ ఓపెన్‌గా చెబుతుండ‌డం విశేషం. ఇదే జ‌రిగితే, నానికి షాక్ తగిలినట్లే. 2019కి ముందే ఆయ‌న చేతులెత్తేయ‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. మ‌రి, ఉమా గేమ్ ప్లాన్‌ని నాని ఎలా కౌంట‌ర్ చేస్తాడో చూడాలి.