హస్తినలో జగన్ పరువు తీస్తున్న ఎంపీలు


Dec 24 2017 5:18 AM

politics,ysrcp,ycp,jagan,ys jagan


హస్తినలో జగన్ పరువు తీస్తున్న ఎంపీలు: ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని పార్టీ ని అధికారంలోకి తీసుకురావాలని ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తుంటే ఆ పార్టీకి చెందిన ఎంపీలు మాత్రం ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు ప్రకటనలు చేస్తూ జగన్ కి కొత్త తలనొప్పి తీసుకొస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై శాసన సభలో ప్రకటన చేసిన తరువాత లండన్ పర్యటన ముగించుకుని వచ్చిన నితిన్ గడ్కరీ

ఇదే విషయం మీద ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ఏపీ బీజీపీ నాయకులు చర్చలు కూడా జరిపారు. కానీ ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు వెంటనే తేరుకుని హడావుడిగా నితిన్ గడ్కరీని కలిసి ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ ని తక్షణమే కేంద్రం స్వాధీనం చేసుకుని కేంద్ర అజమాయిషీలో పనులు జరిగేలా చూడాలని కోరారు. ఇక్కడే వైసీపీ నీచ బుద్ది బయటపడింది. రాష్ట్రం, ఏపీ ప్రజలు నష్టపోయినా పర్వాలేదు మాకు మాత్రం పంతమే కావాలని వైసీపీ ఎంపీలు ప్రవర్తించారు. అక్కడితో ఆగితే పర్లేదు, ప్రత్యేక హోదా వస్తుంది అనుకొంటే, మేము రాజీనామాలు చేసేస్తాం. ఇక్కడ మేము కూడా లేక పోతే కేంద్రాన్ని ప్రశ్నించే వారు లేరని ఆగిపోతున్నాము అంటూ తమ తమ రాజకీయ అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.

నమ్మే వారు ఏదైనా చెప్పేయొచ్చు అని అనుకున్నారేమో అందుకే కేంద్రంలో అడిగేవారు లేరని అందుకే ప్రత్యేక హోదా మీద రాజీనామాలు చేసేందుకు ఆలోచిస్తున్నామని చెప్పుకొస్తున్న వీరు మరి రాష్ట్ర శాసన సభలో ఈ విషయాన్ని ప్రశ్నించాలని తెలియకుండానే శాసన సభకు డుమ్మా కొట్టారా..?

మేము ఏమీ మాట్లాడకపోయినా ఏపీ సీఎం మాత్రం చాలా చక్కగా ప్రశ్నిస్తారనే దైర్యం వేళ్లల్లో కలిగిందేమో. వైసీపీ ఎంపీలు ఆలా చేస్తే రాష్ట్రం లో ఎమ్యెల్యేలు జగన్ సూచనలతో శాసన సభలో అడుగు పెట్టకుండా ఆగిపోయారు. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి..? గతంలోనూ … ఏపీకి ఉపాధి హామీ నిధులు విడుదల అవ్వకుండా చూడాలంటూ వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కేంద్రానికి ఇచ్చిన లేఖలు బయటపడడంతో ప్రజల్లో వైసీపీ పరువు పోయింది. ఆ పోయిన పరువుని మళ్ళీ కాపాడుకోవడానికి అన్నట్టు ఏపీకి ఉపాధి హామీ నిధులు ఎక్కువ కేటాయించామని కోరడం వైసీపీ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం.