ఎపి లో ఓట్ల కోసమే పోలవరం ఆట బీజేపీ కొత్త ప్లాన్ ఇదేనా?


Dec 24 2017 11:03 PM

politics,bjp,andhra pradesh,polavaram,elections


ఎపి లో ఓట్ల కోసమే పోలవరం ఆట బీజేపీ కొత్త ప్లాన్ ఇదేనా?: రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం సహకరించట్లేదని భావన ఆంధ్ర ప్రజలలో బలంగా పడింది. ఆ పార్టీ కూడా కాంగ్రెస్ ల చేసేందుకు ఎపి ప్రజలు అనుకుంటున్నట్లు అర్ధం అవుతుంది. దింతో ఎపి ప్రజలను బీజేపీ వైపు తిప్పుకోవడం కోసం రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం అయినా పోలవరం పైన కన్నేసింది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు గ చేసి దాన్ని కేంద్రం చేస్తులోకి తీసుకోని ఎన్నికల సమయం లో కేంద్రం పూర్తి చేసినట్లు గ ఘనతను సాధించినట్లు చెప్పుకోవాలని కేంద్రం చూస్తుందని సమాచారం.

ఈ వ్యూహంలో భాగంగానే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పర్యవేక్షణలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. రాజయాకియ నిపుణులు సైతం ఇదే వెల్లడిస్తున్నారు. మొదట కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఆ పనులను సకాలంలో పూర్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దింతో 2015 ఆఖరి నుంచి చంద్రబాబు శరవేగంగా ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని కసరత్తులు చేసారు ప్రధాన కాంట్రాక్టు ఆర్ధిక పరిస్థుతుల వాళ్ళ ప్రాజెక్ట్ నిదానంగా జరుగుతుందని కొత్త టెండర్లకు అవకాశం ఇచ్చారు . అయినా కొన్ని రోజులకి కాఫర్ డ్యామ్ విష్యం లో కేంద్రం నుంచి దాన్ని నిలిపివేయమని నోటీసులు వచ్చాయని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ)ని అధ్యయనం చేయాలని కోరడాన్ని జల వనరులశాఖ వర్గాలు తప్పుబడుతున్నాయి.

కానీ నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) నుంచి ఇంకా నివేదికలు రవకపోవడం అందర్నీ అనుమానానికి గురి చేస్తుంది పైగా జల వనరుల శాఖ నుంచి పలు బృందాలు వరుస పెట్టి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రావడం మరియు పరిశీలించడం కూడా అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు సీఈవో హాల్దర్‌ పర్ మరియు కేంద్ర మంత్రి గడ్కరీ ఓఎస్డీ ఖోలాపుర్కర్‌ పర్యటించారు. త్వరలో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ కూడా రానున్నారు. ఇలా వరస పెట్టి కేంద్ర ప్రభుత్వ నిపుణులు రావడం ఈ గేమ్ లోని భాగంగానే పోలవరాన్ని కేంద్రం పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తుందని రాజకీయ ప్రముఖుల అభిప్రాయం.